సిరా న్యూస్,గుత్తి;
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కోసం లంచం అడిగిన ఏఈ ఏసీబీకి దొరికిపోయాడు. వజ్రకరూర్ మండల విద్యుత్ ఏఈ చంద్రశేఖర్, ఒక రైతును 20 వేల రూపాయలు లంచం అడిగాడు. దాంతో రైతు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. గురువారం రాత్రి గుత్తి బస్టాండ్ సమీపంలో రైతు నుంచి 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ చంద్రశేఖర్ ను కర్నూలు ఏసీబీ ఆఫీస్ కి తరలించారు.
A