సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో గుర్తు తెలియని 55 సంవత్సరాల వ్యక్తి మృతదేహం లభ్యమైంది.చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చూరికి తరలించారు.
===