సిరా న్యూస్,రాజానగరం;
కొంతమూరులో దొంగలు హల్ చల్ చేసారు. తాళం వేసి ఊరేళ్లిన ఇంట్లో భారీగా బంగారు, వెండి, నగదు దోచుకెళ్లారు. బాధితురాలు భాధితురాలు బచ్చల గంగ అనే మహిళలు ఫిర్యాదుతో దొంగల ముఠాను పోల్యీసులు పట్టుకున్నారు. నిందితులనుంచి కార్, రెండు బైక్ లు, మూడు కాసుల బంగారం, రెండున్నర కిలోల వెండి అభరణాలు, 20వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరు రాజమండ్రి రూరల్ ప్రాంతానికి చెందిన బండి ధర్మరాజు,వానపల్లి గౌరీ శంకర్ లు గా గుర్తించారు. నిందితులు చెడు వ్యాసనాలకు అలవాటు పడి తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ వెల్లడించారు. నిందితులపై గోకవరం, కోరుకొండ, రాజానగరం, బొమ్మూరు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు అయన అన్నారు.