సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాలలోని పొగాకు కంపెనీ సమీపంలో ఉన్న ఓ పాత ఇనుప సామాన్ల షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదవశాత్తు జరిగినదా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.