సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
చండ్రుగొండ మండల ప్రజలను ఒక ఎలుగుబంటి బెంబేలెత్తిస్తోంది. గత రెండు రోజులుగా వరుసగా మండల ప్రజలపై దాడులు చేస్తోంది. దాంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం నాడు మద్దుకూరు గ్రామంలో ప్రాజెక్టు కట్టపై మార్నింగ్ వాకింగ్ చేస్తున్న నల్లమోతు రామారావుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఘటనలో రామారావు మెడ తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఎలుగుబంటి దాడి నుండి తప్పించుకొని గ్రామంలో చేరుకున్న రామారావు విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే చండుగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో మంగళవారం ఉదయం మరో వ్యక్తిపై దాడి చేసింది. గ్రామంలోని కంచర్ల తిరుపతిపై తన ఇంటి వద్దనే ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో తిరుపతికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి ప్రధమ చికిత్స అందించారు.ఎలుగుబంటి సంచారిస్తు ప్రజలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు, ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఎఫ్ఆర్ఓ ఎల్లయ్య తెలిపారు.ఫారెస్ట్ రెస్క్యూ సిబ్బందితో ప్రత్యేక బంధాలుగా ఏర్పడి ఎలుగుబంటి జాడ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయనన్నట్టు ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.