సిరా న్యూస్,మేడ్చల్;
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు కాలనీలో దారుణం జరిగింది. భర్త రమేష్ అనుమానంతో భార్య కమల(29)ను గొంతు నులిమి హత్య చేసాడు. భార్యను హత్య చేసిన తరువాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.సోమ వారం అర్ధరాత్రి ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనగాం ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు గత కొన్నేళ్లుగా ఉప్పల్ నివాసం ఉంటున్నారు