సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మెరువు దాడులు చేశారు. దిల్సుఖ్నగర్లోని పి అండ్ టి కాలనీలో ఓ ఇంట్లో విక్రయించడానికి నిల్వ చేసిన భారీ మొత్తంలో ‘ఫిజిషియన్స్ శాంపిల్స్’ స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గోదాంను సీజ్ చేశారు. అలాగే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో క్వాక్ క్లినిక్పై దాడి చేసి పర్మిషన్ లేకుండా విక్రయానికి నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు.