సిరా న్యూస్,పెడన;
కృష్ణాజిల్లా పెడనలో వైసీపీ ప్రచార సామాగ్రి నిల్వలనె పోలీసులు సీజ్ చేసారు. పెడన గ్రంథాలయం సమీపంలోని మల్లి అనే వైసీపీ సానుభూతిపరుడి ఇంట్లో ప్రచార సామాగ్రి నిల్వలు వున్నయన్న విశ్వసనీయ సమాచారంతో పెడన పోలీసులు దాడులుజరిపారు. 57 బ్యాగులు, 5 అట్ట పెట్టెల్లో ఉన్న సామాగ్రిని సీజ్ చేసారు. మచిలీపట్నం రూరల్ సర్కిలిన్స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెడన సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు సిబ్బందితో సోదాలు నిర్వహించి ఎన్నికల సామాగ్రిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎన్నికల మెటీరియల్కి సంబంధించిన జెండాలు, టోపీలు,మెడలో కండవాలు తదితర సామాగ్రి సుమారు వాటి ఖరీదు రూ 4 లక్షల 29 వేల 300 విలువ చేసే ఎన్నికలు మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.