సిరా న్యూస్,శ్రీకాకుళం;
టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశ్రాంతి స్థలంలో ఆగి ఉన్న లారీను వెనుక నుంచి మరోలారి అతి వేగంగా ఢీకొంది. ఈప్రమాదంలో లారీ క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.