బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పిఎస్ పరిధి అన్నోజిగూడ ఎన్ టిపిసి చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ నుండి అతివేగంతో వస్తున్న వరంగల్ 1 డిపో బస్సు ఢీకొట్టడంతో వెనుక టైర్ల కింద పడ్డ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. టైర్ కింద పడటంతో శరీరం నుజ్జు నుజ్జుగా మారింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *