సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం శంఖవరం గ్రామం వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొనగా, ద్విచక్ర వాహన దారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. శంఖవరం నుండి వింజమూరు వైపు చిల్లకర్ర లోడుతో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గుండెమడకల గ్రామానికి చెందిన వేములపాటి. మహేష్ (29) ను ట్రాక్టర్ ఢీ కొనగా, అక్కడిక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య, ఒక బాబు ఉన్నట్లు గ్రామస్తులు తెలియజేసేరు.ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారీ అయినట్లు స్థానికులు తెలియజేసేరు. పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యాశాలకు తరలించడం జరిగింది.