సిరా న్యూస్,బాపట్ల;
బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎదురు గల సాయికృష్ణ లాడ్జి పై నుండి జారిపడి వ్యక్తి మృతిచెందాడు.మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన కరుణకుమార్ (39) గా పోలీసులు గుర్తించారు. మృతుడు కరుణకుమార్ భీమవరం అగ్రికల్చర్ ఆఫీస్ లో అటెండర్ గా పని చేస్తున్నారు. వేటపాలెం లో తన పై అధికారి ఇంట్లో శుభకార్యానికి వచ్చి స్థానిక సాయికృష్ణ రెసిడెన్సీ లో రూం తీసుకొని స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అర్థరాత్రి భార్య కు ఫోన్ చేసేందుకు రూం నుండి బయటకు వచ్చిన కరుణకుమార్ ప్రమాదవశాత్తు లాడ్జి పై నుండి జారిపడి మృతి చెందాడు.మృతునికి భార్య ఒక కుమార్తె ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శేషగిరిరావు తెలిపారు.