సిరా న్యూస్,బాపట్ల;
బాపట్ల జిల్లా వేటపాలెం మత్స్యకారుల వలకు ఓ మిస్సైల్ వింత వస్తువు దొరికింది. మండలం లోని పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామం సమీపంలో వేటకు వెళ్ళిన మత్స్యకారుల వలకు ఎర్ ఫోర్స్ కు సంబంధించిన ఓ మిస్సైల్ దొరికింది. దానిని బోటులో ఒడ్డుకు తీసుకువచ్చి మెరైన్ పోలీసులకు అప్పగించారు.అది బాపట్ల సూర్యలంక లోని ఎయిర్ ఫోర్స్ వారికి సంబంధించిందిగా పోలీసులు గుర్తించారు. సూర్యలంక లో గత కొన్ని రోజులుగా వాయు కాల్పులపై డిఫెన్స్ వారి శిక్షణ జరుగుతుంది.మిస్సైల్ ను స్వాధీనం చేసుకున్న మెరైన్ పోలీసులు దానిని సూర్యలంక డిఫెన్స్ అధికారులకు అప్పగించారు.