పార్వతీపురం మన్యం;
కురుపాం మండలం లంకాజోడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో 6నెలల చిన్నారికి, 5 ఏళ్ల కుమారునికి విషం పట్టించింది తల్లి బిడ్డిక రమ్య…అలాగే తాను కూడా సేవించింది. స్థానికులు ఆమె ఒంటి నిండా రక్తం ఉండటాన్ని గుర్తించారు. హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి గ్రామస్తులు తరలించడంతో వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల తండ్రి రమేష్ పార్వతీపురంలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.