సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ లో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొంది.దాంతో ఆ వ్యక్తి ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడు అన్నోజిగూడ ప్రాంతానికి చెందినట్లు సమాచారం
===