సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా నకరికల్లు అడ్డంకి – నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మంగళవారం తెల్లవారుజామున వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నకరికల్లుకి చెందిన కల్లం రామయ్య(45)గా గుర్తించారు,. కూలి పని నిమిత్తం వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. మృతునికి భార్య,ఇద్దరు పిల్లలు,తల్లి వున్నారు.