సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి జిల్లా :
మంగళవారం ఉదయం కురిసిన బారీ వర్షానికి తోడు, హైద్రాబాద్ నుంచి వస్తున్న మూసి వరద నీటి నేపథ్యంలో జిల్లాలో మూసి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. బీబీ నగర్ మండలం రుద్రవెల్లి – భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు మధ్య లో లెవల్ బ్రిడ్జి మీద నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో పోలయీసులు వాహన రాకపోకలు నిలివేసారు. వలిగొండ మండలం భీమలింగం వద్ద లో లెవల్ వంతెన పై నుంచి మూసి నది ప్రవహించే అవకాశం ఉండటం తో ముందస్తుగా బ్రిడ్జి కి ఇరువైపులా ప్రయాణికులు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసారు.