సంచలనంగా మారిన వీడియో

 సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో రాజకీయాల్లో ఓ వీడియో సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. టీడీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీడియోను వైసీపీ రిలీజ్ చేసింది. వైసీపీ 147 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు అధికార పార్టీ రిలీజ్ చేసిన టీడీపీ వీడియోలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. . టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ గా ఉన్న కోనేరు సురేశ్ టీడీపీ నేతలకు చెబుతున్న వివరాలు ఆ వీడియోలో ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో ఓట్ల షేరింగ్ ఏ విధంగా జరిగింది, రానున్న రోజుల్లో ఓట్ల షేరింగ్ ఏ విధంగా జరగబోతోంది? అన్నది పూర్తిగా వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారుఇందులో భాగంగానే 147 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ ముందుంది అని టీడీపీ నేతలే ఒప్పుకున్నారు, అందుకు సంబంధించిన వీడియోను మేము బయటపెడుతున్నాం అంటూ వైసీపీ విడుదల చేసింది. వైసీపీ 147 స్థానాల్లో ముందుంది అని స్వయంగా టీడీపీనే ఒప్పుకుంది, అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ వీడియోను వదిలింది వైసీపీ.టీడీపీ సంచలన వీడియో లీక్.. ఓటమిని ముందే ఒప్పుకున్న టీడీపీ.. రాష్ట్రంలో 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందని టీడీపీ ఒప్పుకుంది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా టీడీపీ నేతలకు ఆ పార్టీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేశ్ దిశానిర్దేశం చేశారు” అంటూ వీడియోను జతపరిచి ట్వీట్ చేసింది వైసీపీ.2014, 2019 ఎన్నికలతో పాటు రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరుగుతోంది. అయితే, ఇందులో 147 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది అని టీడీపీ ఒప్పుకుంది అంటూ వైసీపీ విడుదల చేసిన ఈ వీడియోతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఏపీ రాజకీయవర్గాల్లో ఈ వీడియో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *