సిరా న్యూస్,నంద్యాల;
కోవెలకుంట్ల పట్టణంలోని పోస్టాఆఫిసులో దొంగలు పడ్డారు. పోస్ట్ ఆఫీస్ మెయిన్ గేటు తాళాలు పగలగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు, ఇనుప బీరువాను పగలగొట్టి అందులో ఉంచిన రెండు లక్షల 90 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం యధావిధిగా పోస్ట్ ఆఫీస్ కు వచ్చిన ఉద్యోగులు ప్రధాన గేటుకు వేసిన తాళం పగలగొట్టి ఉండడానికి చూసి, చోరీ జరిగిందన్న విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బీరువాలో తనిఖీ చేసారు. అందులోనే ఉంచిన రూ. 2.90 లక్షలు చోరీకి గురైన విషయం బయటపడింది. పోస్ట్ మాస్టారు గురువయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కోవెలకుంట్ల పట్టణంలో ఆరు నెలల క్రితం ప్రముఖ స్వీట్ స్టాల్ యజమాని ఇంట్లో భారీ చోరీ జరిగింది. అయితే ఇంతవరకు పోలీసులు దొంగలను పట్టుకోలేక పోయారు. అంతేకాక అపోలో మెడికల్ స్టోర్ , డాక్టర్ రామ్ రెడ్డి ఇంట్లో ,ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో, గడ్డ వీధిలో ఓ ఇంట్లో, బీనుపాడు గ్రామంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లోకి వెళ్లాలంటే కోవెలకుంట్ల పట్టణంలో ప్రజలు భయాందోళన గురవుతున్నారు ..