సిరా న్యూస్,పల్నాడు;
పిడుగురాళ్ల పట్నంలో పలుచోట్ల జరుగుతున్న దొంగతనాలతో ఆయా షాపులో వారు బెంబేలెత్తుతూ ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ ఎదుర వీధిలో కొత్త ద్విచక్ర వాహనం బజాజ్ పల్సర్ వాహనాన్ని కొందరు గుర్తుతెలియని యువకులు అపహరించారు. ఇదే రోజు మంగళవారం తెల్లవారుజామున ఆంధ్ర బ్యాంక్ ఎదురు పబ్లిక్ టాయిలెట్స్ ఎనుక బిల్డింగ్ పై నిర్వహిస్తున్న హనీ ప్లాస్టిక్ షాపులో షాప్ యజమాని సుభాని రోజులాగే సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాపుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి బుధవారం ఉదయం 9 గంటల తర్వాత షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్ కొన్న తాళాలు పగలగొట్టి ఉన్నాయి షట్టర్ తీసి షాపులోకి వెళ్ళగా కౌంటర్లో ఉన్న కొంత నగదు ఒక గుర్తు తెలియని యువకుడు అపహరించినట్లు తెలుసుకున్న సుభాని సిసి ఫుటేజ్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు… అలాగే ఇటీవల కాలంలో మరికొన్ని షాపుల్లో కూడా ఇలాగే దోపిడీలు జరిగినట్లు ఆయా షాపులు వారు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి సిసి ఫుట్ పేజీ కూడా వారు పంపడం జరిగింది. పోలీసులు నిఘా ఉంచి నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు..