A seven-foot cobra rattled in the premises of the Srisailam temple : శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో ఏడు అడుగుల నాగుపాము కలకలం

సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయం ప్రాంగణంలో భారీగా ఉన్న ఏడు అడుగుల నాగు పాము కొంతసేపు భక్తులను ఆచ్చర్యానికి గురి చేసింది అమావాస్య పైగా రేపు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతోభారీ పోడవుగల నాగుపాము ఆలయ ప్రాంగణంలోని శ్రీస్వామివారి గర్భాలయ పై భాగంలో శ్రీస్వామి అమ్మవారి కళ్యాణ మండంపలో నిత్యం భక్తులు తిరిగే ప్రదేశంలో భక్తులకు పాము కనపడింది పామును చూసిన భక్తులు స్వయాన దేవతలను చూసినట్లు భక్తి పర్వశంతో ఆచ్చర్యానికి లోనయ్యారు అలర్టైన ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ కాళీ చరణ్ కు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచ్చర్ బొక్కలోదూరిన పామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తీసుకెళ్లారు దీనితో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు రేపటి నుండి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సమీస్తున్న సమయంలో నాగుపాము భక్తులకు కనపడటం భక్తులుభక్తి భావంతో దర్శించుకోవడం ఆనందానికి గురయ్యారు అయితే ఇంత పెద్ద దేవాలయానికి అత్యవసర పరిస్థితుల్లో పాములను పట్టుకునేందుకు దేవస్థానం తరుపున స్నేక్ క్యాచర్ లేకపోవడం విశేషం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *