సిరా న్యూస్,బాపట్ల;
చీరాలలో జనసేనకు షాక్ తగిలింది. చీరాల నియోకవర్గ జనసేన సమన్వయకర్త పదవికి ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) రాజీనామా చేసారు. గిద్దలూరు టికెట్ ఆశించిన ఆమంచి స్వాములు, పార్టీ చీరాల భాద్యతలు అప్పగించటంపై కినుక వహించారు. పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని ఆమంచి స్వాములు అంటున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా జనసేన ఇంచార్జి పదవి కి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేసారు. జనసేన పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆమంచి స్వాములు టికెట్ పై స్పష్టత రాని కారణంగా స్వాములు రాజీనామా చేసినట్లు సమాచారం.. స్వాము లు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి స్వయాన సోదరుడు.