సిరా న్యూస్,రాజేంద్రనగర్;
మణికొండ అల్కాపూరి కాలనీ లో విషాదం నెలకొందిద. అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాట లో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందాడు. 15 లక్షల వరకు లడ్డుని శ్యామ్ వేలం పాట పాడాడు. గణనాథుడి మండపం వద్ద నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేసాబు. గణనాథుడి మండపం వద్ద చాలా సేపు శ్యామ్ నృత్యాలు చేసాడు. లడ్డు కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తీన్ మార్ స్టేప్పులు వేసాడు. ఇంటికి వెళ్లే సరికి కుప్పకూలిన శామ్ మృతి చెందాడు. గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు సమాచారంం. శ్యామ్ ప్రసాద్ మృతితో కాలనీ వాసులు విషాదం లో మునిగి పోయారు.