శ్రీశైలంలో ప్రత్యేక ఉత్సవం

సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవ నిర్వహించి భక్తులను ఉత్తరద్వారం ద్వారా శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి దేవస్థానం ఈవో పెద్దిరాజు,అధికారులు అనుమాతిస్తున్నారు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాలపూజ అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఉత్తరద్వార ముఖమండపం నుండి వెలుపలకు తోడ్కొని వచ్చి రావణవాహనంపై అధిష్ఠింపజేసి అర్చకులు ఉత్సవ సంకల్పన్ని పఠనించి ప్రత్యేక పూజలు,అర్చనలతో హారతులిచ్చారు అనంతరం రావణవాహనోత్సవపై క్షేత్రపురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు అలానే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం ముఖమండపం వెలుపల (బలిపీఠం సమీపంలో) ఆశీనులను చేశారు భక్తులు శ్రీస్వామి అమ్మవారిని ఉత్తరద్వారా దర్శనం ద్వారా దర్శించుకుంటున్నారు విశేషపూజలు,గ్రామోత్సవం అనంతరం ఉదయం 6 గంటల నుండి శ్రీస్వామి అమ్మవార్ల సర్వదర్శనానికి,ఆర్జితసేవలకు భక్తులను అనుమతించారు భక్తులు తెల్లవారుజాము నుండే క్యూలైన్లలో బారులు తీరారు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *