సిరా న్యూస్,విశాఖపట్నం;
నై రుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను తీవ్రతుఫాన్ గా బలపడి గంటకు 8 కి.మీ వేగంతో ముందుకు సాగుతోం ది. పాండిచ్చేరికి ఈశాన్యంగా 210 కిలోమీటర్ల దూ రంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో,నెల్లూరుకు ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో,బాపట్ల కు దక్షిణ ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో,మచిలీపట్నానికి ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలోకేంద్రీకృతమైంది.రేపు ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాల పడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ ఆదికారి తెలిపారు.