సిరా న్యూస్,న్యూఢిల్లీ;
మరికొద్ది గంటల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. తాజా ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు. 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఇదే. 1.5కోట్ల మంది పోలింగ్, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారు. 68,763 బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయి. 135 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చాం. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4లక్షల వాహనాలను ఉపయోగించాం. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గింది. ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్ జరిగింది. గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. మొత్తం అక్కడ 58.58శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కశ్మీర్ లోయలో 51.05శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నాం. రూ.10వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. 2019లో ఈ సంఖ్య రూ.3,500కోట్లుగా ఉంది. ఈ ఎన్నికల సమయంలో సీ-విజిల్ యాప్లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 99.9శాతం ఫిర్యాదులను పరిష్కరించాం. ఇందులో 87.5శాతం వాటికి 100 నిమిషాల్లోపే పరిష్కారం చూపాం. డీప్ఫేక్ వీడియోలను నిలువరించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో సోమవారం భారత షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని అన్నారు.
===========================xxxx