సిరా న్యూస్,కోటిపల్లి;
టూరిజం అభివృద్ధిలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునిక హంగులతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలో నిర్మించిన పర్యాటక భవనం నిరుపయోగంగా మారింది. 2013 వ సంవత్సరంలో అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చేతుల మీదుగా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో పర్యాటక భవనాన్ని కోటిపల్లి గోదావరి తీరంలో నిర్మించారు. 2019లో అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ భవనాన్ని ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి భవనం వినియోగంలోకి రాకపోగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వినియోగం లోకి రాకుండానే అధికారుల అలసత్వం వల్ల భవనం రూపురేఖలు మారిపోయింది. ఇప్పటికైనా ఈ పర్యాటక భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పర్యాటకులకు ఉపయోగపడే విధంగా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.