సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ అంబర్ పెట్ డిడి కాలనీలో మారో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుంటే భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముషీరాబాద్ ఎస్ఆర్ టి కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలితో ఉల్లాసంగా గడుపుతుండగా అతడిని భార్య మెర్సీ ఆమె పిల్లలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తన భర్తతో ఎలా ఉంటావు అనిప్రవీణ్ ను ఆయన ప్రియురాలిని నిలదీసింది. ప్రియురాలిని అడ్డుకొని బార్య మెర్సీ కొడుకుని భర్త ప్రవీణ్
తీవ్రంగా కొట్టారు. సోషల్ మీడియాలో గొడవ వీడియో వైరల్ గా మారింది. కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రియురాలు తో అంబర్పేట్ లోని డిడి కాలనీలో సహజీవనం చేస్తున్నారు. యువతితో తన భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య అవేదన వ్యక్తం చేసింది. భర్త ప్రవీణ్ దాడి చేస్తుండగా భార్య మెర్సి పిల్లలు పోలీసులను ఆశ్రయించింది. ఘటనా స్థలాన్ని చేరుకున్న అంబర్పేట్ పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.