సిరా న్యూస్,మేడ్చల్;
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది.ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి ద్విచక్ర వాహనం స్కిడ్ అయి రోడ్డుపై పడిపోగా వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు యువకుడి తలపై నుండి వెళ్లడంతో యువకుడు అక్కడికక్కడే మృ చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
===================