సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపెల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి భరత్ లో యువకుడు డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఓదెల మండలం కొలనూరు గ్రామంలో జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఓ పెళ్లి భరత్ లో రావుల విజయ్ కుమార్ (33) అనే యువకుడు డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. కొలనూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి భరత్ లో రావుల విజయ్ కుమార్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కింద కుప్పకూలిపోగా వెంటనే స్థానికులు ఆసుపత్రుకి తరలించగా అప్పటికే గుండెపోటుతో విజయ్ కుమార్ మృతి చెందాడు. మృతుడిది కరీంనగర్ తీగలగుట్టపల్లి చెందినవాడు విజయ్ కుమార్ మృతితో ఆ పెండ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోదనతో ఆసుపత్రి ప్రాంగణం మార్మోగింది.
=====================xxxx