సిరాన్యూస్, నిర్మల్
చెరువును పునరుద్ధరించాలి : ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్
* కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
ధర్మసాగర్ చెరువుపై నిర్మించిన వాకింగ్ ట్రాక్ ని తొలగించి, బఫర్ జోన్ ఎఫ్ టి ఎల్ సరిహద్దులతో చెరువును పునరుద్ధరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏ ఏపీ )జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ మాట్లాడుతూ ధర్మసాగర్ చెరువు పై నిర్మించిన వాకింగ్ ట్రాక్ ను తొలగించి ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లను పరిగణలోకి తీసుకొని చెరువును విస్తరించి సంరక్షించాలని అన్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన వాకింగ్ ట్రాక్ తో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని తెలిపారు. ప్రస్తుతం అది నిరుపయోగంగా మారిందని తెలిపారు.చెరువు నీటిని బయటకు తీసుకెళ్లే కాలువలను పునరుద్ధరించి చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలి కోరడం జరిగింది. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటాం న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారుజ. ఈ కార్యక్రమంలో చాత్ర యువ సంఘర్షణ సమితి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, శీతలకర్ అరవింద్, నిర్మల్ నియోజక మైనార్టీ సెల్ అధ్యక్షులు సోఫీ మహమ్మద్, ఇలియాస్, మైనార్టీ సెల్ సెక్రెటరీ అర్షాద్, తదితరులు పాల్గొన్నారు.