సిరాన్యూస్, బేల
మెగా డీఎస్సీ పోస్టులను విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు ధర్నా
బడీఎస్సీ పోస్టులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్,జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా వచ్చి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వారు మాట్లాడుతూ 25 వేల మెగా డీఎస్సీ పోస్టులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని అన్నారు.రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ పాలన లాగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహేష్, కుర్మ పవన్ రెడ్డి,అభిషేక్ అనూజ్ రెడ్డి, శివారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.