సిరాన్యూస్, బోథ్
బోథ్‌లో విద్యాసంస్థల బంద్ విజయవంతం: రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకాష్
ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకాష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వాలలో ఎలాంటి సమస్య లు అయితే ఉన్నాయో అవే సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. పేద, మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, పరిస్థితులకు భయపడి వారి తల్లి దండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చది వించడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రి నియామకం చేసి, గత ప్రభుత్వాల తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలని ఆయన సూచించారు. అదిలాబాద్ జిల్లాలోని బోథ్ పాఠశాల యాజమాన్యాలు సహకరించినందుకు ధన్యవాదాలు.ఈ కార్యక్రమం లో సుకుమార్, కార్తీక్ ,మరియూ, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.