సిరా న్యూస్, బేల:
రక్తదానం చేసి మానవత్వం చాటిన ఏబీవీపీ సభ్యులు
అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలానికి చెందిన ధోని పోచన్నకు ఏబీవీపీ సభ్యులు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. పోచన్నకు తెల్ల రక్త కణాలు తక్కువ ఉండడంతో అతని కుటుంబ సభ్యులు ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ ను ఆదివారం సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన ఏబీవీపీ సభ్యులతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి రక్త నిధి కేంద్రంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసి, ప్రాణ దాతలుగా నిలవాలని కోరారు. విద్యారంగ సమస్యలే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాల్లో సైతం ఏబీవీపీ సభ్యులు ముందు ఉంటారని ఆయన అన్నారు. అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన ఏబీవీపీ సభ్యులకు పోచన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసిన వారిలో కృష్ణ కార్తీక్, తదితరులు ఉన్నారు.