ABVP Harish Reddy: కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి
* మండ‌లంలో పాఠ‌శాల‌ల బంద్ విజ‌య‌వంతం

కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ బేల‌ మండల కేంద్రంలోని ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల కేంద్రంలోని విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది.బేలా లో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించగా,తెరచుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి బంద్ నిర్వహించారు. సందర్భంగా ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మడవార్ హరీష్ రెడ్డి మాట్లాడుతూ….స్కూల్స్ ప్రారంభమై 16 రోజులైనా బుక్స్ పంపిణీ చేయకపోవడం ఏంటని నిలదీశారు. సర్కారు పాఠశాల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు విద్యారంగ సమస్యల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు బుధవారం ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాఠశాలల బంద్ నిర్వహించడం జరిగింది అని తెలిపారు.ప్రభుత్వ స్కూళ్లలో ,ఎంఈవోల ను. నియమించాలని, మధ్యాహ్న భోజనం అవక తవకలపై విచారణ జరపాలని, మెగా డీఎస్సీ ద్వారా 24 వేల ఖాళీలు భర్తీ చేయాలన్న డిమాండ్లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రేసు మనోజ్ రెడ్డి, రాపెళ్లివార్ కృష్ణ, ప్రీతం, సాయి పాయల్,రాజు సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *