సిరా న్యూస్ కుందుర్పి
ఏసీబీ వలలో తహసీల్దార్
* రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన తహసీల్దార్
మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. శామీర్పేట తహసీల్దార్ లంచం తీసుకుంటూ
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంతో పాటు సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పాస్ పుస్తకాలు కోసం తహసీల్దార్ రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.