సిరాన్యూస్, శ్రీరాంపూర్
ఏసీబీ వలలో కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా
భూమి పట్టా కోసం లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తహసీల్దార్ జాహిద్ పాషా ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రైతు కాడం మల్లయ్యకు సంబంధించిన కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పందిళ్ళ గ్రామ శివారులో 645 ఆ లో సర్వేనెంబర్ 28 గుంటల భూమి ఉంది. కాడం మల్లయ్య కు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు ఉన్నా కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడడంతో వివాదంలో కొనసాగుతోంది. దీంతో రైతు ఈ భూమికి సంబంధించిన పట్టా కోసం తహసీల్దార్ జాహిద్ పాషాను పలుమార్లు కలిశాడు. దీంతో తహసీల్దార్ పట్టా చేయడానికి డబ్బులు డిమాండ్ చేశాడు. ఏమి లేయలేక రైతు ఏసీబీని ఆశ్రయించాడు. అయితే శనివారం కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జహీద్ పాషా, తహసీల్దార్ డ్రైవర్ అంజాద్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
