ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ మంగళవారం సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఇంటితో పాటు ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. అయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరగినట్లు సమాచారం. సాహితి ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఈ ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…
=========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *