ఐదుగురికి తీవ్ర అస్వస్థత
సిరా న్యూస్,గాజువాక;
శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో కెమికల్ పౌడర్ లీక్ కావడంతో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. తోటి కార్మికులు వెంటనే వీరిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కార్మికులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గణబాబు ఇతర అధికారులు ఆసుపత్రిలో కార్మికులను పరామర్శించారు. ఇదిలా ఉండగా వారం రోజులు క్రితం ఇదే సంస్థలో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
గాజువాక సింహగిరి హాస్పిటల్ కి సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చీవెళ్లారు. శ్రావణ్ షిపింగ్ లో గాయపడిన వారిని పరిస్థితి గురించి డాక్టర్ని, బంధువులను అడిగి తెలుసుకున్నారు.