సిరా న్యూస్,వికారాబాద్;
మూడు రోజుల క్రితం పులుమద్ది గ్రామ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు చేవెళ్ల గ్రామానికి చెందిన అనసూయ (35) అనే మహిళగా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి ధారూర్ మండలం రాజపూర్ గ్రామానికి చెందిన తలారి బాబు గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మూడు సంవత్సరాలుగా మృతురాలు అనసూయ బాబు మధ్య అక్రమ సంబంధం నడుస్తోంది. ఆరు నెలల క్రితం అనుసూయ బాబుకు గొడవ అయింది. గొడవతో పాటు ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం బాబుకు వచ్చింది. గొడవ, అక్రమ సంబంధాలను మనసులో పెట్టుకొని తలారి బాబు అనసూయ మట్టు పెట్టాలని పథకం వేసాడు. వికారాబాద్ మండలం పులమద్ది గ్రామంలో తలారి బాబు అక్క ఉండడంతో అక్కడికి వెళ్దామని చెప్పి మార్గమధ్యంలో అనసూయకు మద్యం తాగించాడు. తరువాత అక్కడే బాబు అనసూయ చీరతో ఊరివేసి చంపేసాడు. మృతురాలిని గుర్తు పట్టకుండా ఉండేందుకు నిందితుడు నిప్పంటించాడు. ఈ హత్య కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. బాబు గతంలో జరిగిన ఓ జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా వున్నాడని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి వెల్లడించారు.