సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఈనెల 27న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు: ఉద్యమకారుల మండల అధ్యక్షుడు జనగామ రవి
సెప్టెంబర్ 27న జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేద్దామని తెలంగాణ ఉద్యమకారుల మండల అధ్యక్షుడు జనగామ రవి అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లామండల కేంద్రంలో కాల్వ శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాదులో ఈనెల 27న మధ్యాహ్నం 12 గంటలకు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణం హరిహర కళా భవన్ లో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల సదస్సుకు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఉద్యమకారులందరు 2001 నుండి ఉద్యమం కోసం శ్రమించిన వారందరూ హాజరుకావాలని కోరారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సర్కార్ కు మద్దతుగా ఉన్నామని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ పింఛన్ తో పాటు 250 గజాల ఇంటి స్థలం కేటాయిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు పాలకాని కనకయ్య, కాసర్ల సాగర్ రెడ్డి, పత్తి తిరుపతి రెడ్డి, వేముల రామచంద్రం, విశ్వనాథ్ పాల్గొన్నారు.