నటి హేమ నోరు పారేసుకోకుండా వుండాలి

కరాటే కల్యాణి
 సిరా న్యూస్,హైదరాబాద్;
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తో పట్టుబడిన విషయం తెలిసింది. ఇండస్ట్రీలో తానే పెద్దదిక్కు అంటూ చేప్పుకునేది. ఎవర్ని వదలకుండా ప్రతి ఒక్కరిని దూషించేదని నటి కరాటే కళ్యాణి మండిపడ్డారు. ఇండస్ట్రీ అంతా నా మీదే ఆధారపడింది అనేలా ఉండేది. నేను పేకాట ఆడాడు అని నా మీద విమర్శలు చేసింది. ఈ రోజు నువ్వు ఏం చేశావు హేమ అని ప్రశ్నించారు. శాంపిల్స్ లో డ్రగ్స్ సేవించినట్లు వస్తే బెంగళూరు పోలీసులు నీకు పనిష్మెంట్ ఇస్తారు దానితోపాటు మరికొన్ని పనిష్మెంట్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఒక మాట అనే ముందు కర్మ తిరిగి వస్తుంది అంటారు అది నీ విషయంలో జరిగింది. ఇకనైనా జాగ్రత్తగా నడుచుకో హేమ. దేవుడు దయవల్ల ఈ కేసు నుంచి బయట పడాలని కోరుకుంటున్నా. ఇంకొకసారి ఎవరి మీద నోరులు పారేసుకోకుండా నువ్వు ఉండాలని అన్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *