ADA Yallappa: నకిలీ ఎరువులు విక్రయిస్తే లైసెస్సులు రద్దు : ఏడీఏ యల్లప్ప

సిరాన్యూస్‌, కళ్యాణదుర్గం
నకిలీ ఎరువులు విక్రయిస్తే లైసెస్సులు రద్దు : ఏడీఏ యల్లప్ప

నకిలీ ఎరువులు విక్రయిస్తే లైసెస్సులు రద్దు చేస్తామ‌ని ఏడీఏ యల్లప్ప అన్నారు. శుక్ర‌వారం కళ్యాణదుర్గం మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఎరువుల దుకాణాల్లో నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తమ పరిశీలనలో గుర్తిస్తే దుకా ణాల లైసెన్సులను రద్దు చేస్తామ‌ని తెలిపారు. డీలర్, దుకాణ యజమాని రైతు కొనుగోలు వాటికి సంతకాలతో కూడిన బిల్లును అందజేయాలని అన్నారు.. క్రిమి సంహారక మందులు కొనుగోలు చేసే సమయంలో డబ్బాపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాల‌ని తెలిపారు.తెలిసిన వారికి చూపించి అది ఏ కంపెనీదో నిర్ధారించిన తర్వాతే కొనుగోలు చేయాలని అన్నారు. డబ్బాపై చూపించిన వివరాల ప్రకారమే మందు పిచికారీ చేయాలని అన్నారు. లేదంటే పంటలు దెబ్బ తినే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *