సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదర్శ నగర్ గణపతి లడ్డూ రూ .27201 దక్కించుకున్నచంద్ర మణి
* ఆదిలాబాద్లో అదరహో అన్నట్లుగా లంబోదరుని లడ్డూ వేలం
గణేశ్ ఉత్సవాలు అనగానే అందరి దృష్టి పెద్ద పెద్ద విగ్రహాలు ఆ తర్వాత లడ్డు వేలం పాటపైనే ఉంటుంది.లడ్డూ కావాలా నాయనా అంటూ గణపతి ఊరిస్తుంటే.. వేలు పోసి లడ్డు దక్కించుకోవాలని భక్తులు ఊవ్విళ్లూరుతుంటారు. లడ్డూ దక్కించుకోవడం ప్రస్టెజియస్ ఇష్యూగా మారిన తరుణంలో ఈ ఏడాది ఆదర్శనగర్ లడ్డూ ధర రికార్డులు తిరగరాశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఆదర్శ గణేష్ మండల ఆధ్వర్యంలో ఏడు రోజులు పూజలు అందుకున్న గణపతి శుక్రవారం నిమర్జనంలో భాగంగా కాలనీకి చెందిన చంద్ర మణి 27201 లకు లడ్డు వేలం దక్కించుకున్నారు. ఈ వేలంలో గణేష్ మండల అధ్యక్షులు కేమ కిష్టయ్య,సభ్యులు కలిసి లడ్డూ దక్కించుకున్న చంద్ర మణి ని శాలువాతో సత్కరించారు. అనంతరం లడ్డూ అందించడం జరిగింది.ఈ వేలంలో గణేష్ మండల సభ్యులు పట్టేపు అశోక్,రమేష్,రవి,రాజేందర్,భూపాల్,ఉమేష్,తిరుపతి,సుధన్,నర్సింగ్ రావు,శ్రీకాంత్, పురుషోత్తం, సుదర్శన్, వెంకట్, సతీష్ రావు, సాగర్, సంతోష్, శ్రీనివాస్, వికేష్, పవన్, వెంకన్న,సతీష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.