సిరా న్యూస్, ఆదిలాబాద్
రుణమాఫీ గొప్ప నిర్ణయం : డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి
* బీఆర్ఎస్ తాను తీసిన గోతిలో తానే పడింది
* కేంద్రంలోని బీజేపీ కూడా చేసిందేమీ లేదు
* జిల్లా అభివృద్ధికి ఎంపీ నిధులు తేవాలి
తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్యారెంటీ హామీలు నెరవేర్చి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందిందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ లో మీడియా తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయని విధంగా ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తున్న మొదటి ప్రభుత్వం తమ కాంగ్రెస్ సర్కార్ అన్నారు. అటు రైతు భరోసా కూడా ఎన్నిఎకరాలకు ఇవ్వాలి అని గ్రామ సభలు ద్వారా రైతుల అభిప్రాయాలమేరకు నిర్ణయిస్తుందన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు 2500 త్వరలో అమలు కానున్నావన్నారు. ఇక బీఆర్ఎస్ విమర్శలపై మాట్లాడుతూ దేవుడున్నాడని ఎవరు తీసిన గోతిలోవారే పడతారని బీఆర్ఎస్ తాను తీసిన గోతిలో తానే పడిందన్నారు. ఆనాడు ఫుల్ మెజార్టీ ఉన్నా కాంగ్రెప్ ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులా కొనుగోలు చేసిందన్నారు. కాని ఇప్పుడు కేవలం రాష్ట్ర అభివృద్ధి ఆశించి మాత్రమే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ,ఈసారి అభివృద్ధి చేసకుందామని పార్టీలో చేరుతున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తన పదవికి రాజీనామా చేసి మరీ అదే ఉద్దేశంతో చేరారన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కేటీఆర్ కొత్తగా మాట్లాడుతున్నాడని, మరి ఆనాడు మీ తండ్రి చేసింది ఏంటో సమాధానం చెప్పాలని అన్నారు. అలాగే కేంద్రంలో అధకారంలో ఉన్న బీజేపీ కూడా చేసిందేమీ లేదన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరికలైన టెక్స్ టైల్ పార్క్ , ఆదిలాబాద్ టూ ఆర్మూర్ రైల్వేలైన్ , గిరిజన యూనివర్సిటీ ,సీసీఐ, ఎయిర్ పోర్ట లాంటి అంశాలు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నకేంద్రం ఏమి చేయలేక పోయిందని నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పై వేసిందన్నారు. కేంద్రంకు ఏవైనా ప్రతిపాదనలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని తమ ప్రభుత్వం అభివృద్ధి కోసం కావలసిన అనుమతులిచ్చేందుకు ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. కొత్తగా ఎంపికైన బీజేపీ ఎంపీ ఈ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని లేదంటే ఆయన వెంటపడి సాధించే వరకు వదిలిపెట్టమన్నారు. ఈ కార్యక్రమం లో జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,మావల ఎంపీపీ దర్శనాల సంగీత – ఏవన్,మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్,దర్శనాల లక్ష్మణ్,జాఫర్ అహ్మద్,భూమన్న,రామ్ కుమార్,ఆనంద్,ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,ఎన్.ఎస్. యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీ,నాయకులు బాయిన్ వార్ గంగా రెడ్డి,సుధాకర్ గౌడ్, ఎం.ఏ షకీల్, తమ్మల చందు, కందుల సుకేందర్, మహేందర్, ఎం.ఏ కయ్యుమ్, సమీ ఉల్లా ఖాన్, అల్లాబకష్ తదితరులు పాల్గొన్నారు.