Addi Bhoja Reddy: జ‌గ్జీవ‌న్‌రామ్ ఆశ‌య‌ సాధ‌న కోసం కృషి:  డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
జ‌గ్జీవ‌న్‌రామ్ ఆశ‌య‌ సాధ‌న కోసం కృషి:  డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి

మ‌హానీయుల జ‌యంతి, వ‌ర్ధంతిల‌ను జ‌రుపుకోవ‌డ‌మే కాకుండా వారి ఆశ‌యాల సాధ‌న కోసం ప్ర‌తిఒక్క‌రూ కృషి చేయాల‌ని డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఆదేశాల‌తో సంఘ సంస్క‌ర్థ‌, స్వాతంత్ర స‌మ‌ర యోధుడు బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని కాంగ్రెస్ శ్రేణులు ఘ‌న నివాళులు అర్పించారు. స్థానిక జ‌గ్జీవ‌న్‌రామ్ చౌక్‌లోని విగ్ర‌హం వ‌ద్ద ఆయ‌న‌ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళ్ల‌ర్పించారు. దేశానికి, స‌మాజానికి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని కాంగ్రెస్ నాయ‌కులు అన్నారు. స‌మాజ హిత‌మే ల‌క్ష్యంగా ఆయ‌న త‌న జీవితాన్ని గ‌డిపార‌న్నారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద‌ళితుల సంక్షేమాన్ని విస్మ‌రించింద‌న్నారు. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న పేరుతో అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేసే దిశ‌గా ముందుకుసాగుతోంద‌న్నారు. కార్యక్రమం లో జైనథ్ మాజీ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్,మావల మాజీ ఎంపీపీ దర్శనాల సంగీత – ఏవన్,పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, కౌన్సిలర్ ఆవుల వెంకన్న,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,బాయిన్ వార్ గంగా రెడ్డి,,నాయకులు ఎం.ఏ షకీల్,రాజేశ్వర్,యాల్ల పోతా రెడ్డి,అంజద్ ఖాన్,ఎం.ఏ కయ్యుమ్,అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *