Addi Bhoja Reddy: జ‌గ్జీవ‌న్ రాం ఆశ‌య సాధ‌న కోసం ప‌ని చేయాలి:  డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
జ‌గ్జీవ‌న్ రాం ఆశ‌య సాధ‌న కోసం ప‌ని చేయాలి:  డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి
* ఘ‌నంగా బాబు జ‌గ్జీవ‌న్ రాం జ‌యంతి వేడుక‌లు
* విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించిన‌ కాంగ్రెస్ శ్రేణులు

ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు , బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల పెన్నిధి బాబు జ‌గ్జీవ‌న్ రాం జ‌యంతి వేడుక‌లు కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈసంద‌ర్బంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జ‌గ్జీవ‌న్ రాం చౌక్ వ‌ద్ద‌కు భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళ్లు అర్పించారు. కేంద్రంలో అత్య‌ధిక కాలం మంత్రిగా ప‌ని చేసి బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం ఎన‌లేని సేవ‌లందించార‌ని డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి అన్నారు. అంట‌రాని త‌నం నిర్మూల‌నకు విశేషంగా కృషి చేసార‌ని కితాబిచ్చారు.స‌మ సమాజ స్థాప‌న కోసం అవిశ్రాంతంగా శ్ర‌మించిన కృషీవ‌లుడ‌ని కొనియాడారు. ప్ర‌తి ఒక్క‌రు ఆ మ‌హ‌నీయుని అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌ని ,ఆయ‌న ఆశ‌య సాధ‌న కోసం ప‌ని చేయాల‌ని నాయ‌కులు , కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, పార్లమెంట్ కో. ఆర్డినేటర్ సెడ్మాకి ఆనంద్ రావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాయిన్ వార్ గంగా రెడ్డి, గోపిడి రుక్మ రెడ్డి, బండి దేవిదాస్ చారి, సుధాకర్ గౌడ్, తమ్మల చందు, మునిగేల విట్టల్, కోరేటి కిషన్, కయ్యుమ్, రఫీక్, శ్రీ రామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *