సిరాన్యూస్, ఆదిలాబాద్
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం తధ్యం : అడ్డి భోజారెడ్డి
* కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాటిష్టం
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజక వర్గంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా తయారైందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు.దీంతో ఈ నియోజక వర్గం నుండి తమ పార్టీ లోక్ సభ అభ్యర్ధికి ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ హామీలే , పార్లమెంట్ అభ్యర్ధుల విజయాలకు బాటలుగా మారుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందన్న బీఆర్ఎస్ నాయకుల మాటలకు ఆయన బదులిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేసిందని అది తెలియక మాట్లాడుతున్నారని ఏద్దేవా చేసారు. ఇక బీజేపీ గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలంగాణా రాష్ట్రానికి ఒరిగింది సున్నా అని విమర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలేవి తీర్చలేదన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానని మోసం చేసారని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లోని ప్రధాన సమస్యలపై మోదీ ఇక్కడకు వచ్చినప్పుడు కనీసం వాటి పైన ఊసే ఎత్తలేదని అలాంటి ప్రభుత్వానికి మద్దతు తెలపవద్దని ప్రజలను కోరారు.పేదల కష్టాలు తీర్చగల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ,కౌన్సిలర్ సాయి ప్రణయ్,శ్రీ లేఖ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాయిన్ వార్ గంగా రెడ్డి, పోరెడ్డి కిషన్, బండి దేవిదాస్ చారి, భోజా రెడ్డి, సుధాకర్ గౌడ్, కందుల సుకేందర్, మైనారిటీ నాయకులు ఎం.ఏ షకీల్, ఖయ్యూం, పత్తి ముజ్జు, ఖలీం, రఫీక్, షేక్ మన్సూర్, కర్మ, అంజద్ ఖాన్, షేక్ షాహిద్, మెస్రం చిత్రు, జగదీశ్వర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.