సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
నూతన భవనాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ఫైజల్ హైమద్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శివాజీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి నిర్మిస్తున్నటువంటి నూతన భవనాన్ని శనివారం నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ పైజల్ హైమద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదులో భాగంగా ఖానాపూర్ పట్టణంలో నిర్మిస్తున్న భవనం పైన వచ్చిన ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఫిర్యాదులలో భాగంగా శనివారం ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ కాలనీలో నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు నాయిని సంతోష్ , అమనుల్లా ఖాన్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.