సిరా న్యూస్,పరవాడ;
అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికలకు సంబంధించి దేశపాత్రునిపాలెం వద్ద ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ను ఆదివారం జిల్లా అదనపు ఎస్పీ బి విజయ్ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విధుల్లో ఉన్న జిల్లా పోలీస్ సిబ్బంది, కేంద్ర పోలీస్ దళాలు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించి, అక్రమ రవాణా అరికట్టేందుకు డబ్బు, మద్యం, నాటు సారా, గంజాయి మరియు ఉచిత కానుకలు పంపిణీ నిరోధించేందుకు పటిష్ట తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆయన వెంట పరవాడ ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు,పరవాడ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
=============================